తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్తీ మద్యం ఘటనలో 21కి చేరిన మృతులు - మురైనా జిల్లా కల్తీ మద్యం

మధ్యప్రదేశ్​లోని మురైనా జిల్లా కల్తీ మద్యం ఘటనలో మరో ఏడుగురు మృతిచెందారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

liqour deaths, madhya pradesh
మధ్యప్రదేశ్​లో కల్తీ మద్యం

By

Published : Jan 13, 2021, 3:51 PM IST

Updated : Jan 13, 2021, 5:14 PM IST

మధ్యప్రదేశ్​లోని మురైనా జిల్లాలో కల్తీ మద్యానికి మరో ఏడుగురు బలి అయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఘటనకు బాధ్యులుగా మురైనా కలెక్టర్,​ ఎస్పీ తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

దర్యాప్తుపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

పదివేల రూపాయలు రివార్డు..

ఏడుగురిపై కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టిస్తే 10వేల రూపాయల రివార్డు అందిస్తామని ప్రకటించారు.

మితిమీరి మద్యం సేవించడమే మరణాలకు కారణమని ప్రాథమిక పరీక్షల్లో తెలిసింది. అవయవాలను సాగర్​లోని ఫోరెన్సిక్​ విభాగానికి పంపించాము. ఆ నివేదికల ద్వారా కల్తీ మద్యం స్వభావం తెలుస్తుంది."

-డాక్టర్ ఆర్​సీ బందిల్​, మురైనా చీఫ్ హెల్త్ ఆఫీసర్​

అదే కారణమా?

సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు కారణం అధిక శాతంలో మిథనాల్​ను ఇథనాల్​తో కలపడమేనని ఆరోగ్య భద్రత అధికారి ప్రీతి గైక్వాడ్​ వెల్లడించారు.

ఇదీ చదవండి :ఆ కేసు వారే విచారించాలని పిటిషన్​- రూ.లక్ష జరిమానా​

Last Updated : Jan 13, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details