శాసనసభ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకుంది కమలదళం. శివరాజ్ జట్టులోని 80మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భాజపాకు ముందే తెలుసు. అయినా వారిని ఎన్నికల బరిలోకి దింపింది. ఓటమి పాలైంది. ఈ పరాజయం నుంచి కోలుకోకముందే మధ్యప్రదేశ్‌లో భాజపాకు మరో సవాలు ఎదురైంది. అదే... సార్వత్రిక సమరం.
"గత పదిహేనేళ్లుగా భాజపా పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఓటమికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతే. అందుకు కారణం నేతల పనితీరు సరిగా లేకపోవడం. దీన్ని మేం విస్మరించాం. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని 13 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇలాంటి తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటాం."
-ఓ భాజపా నేత