తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్ కార్యాలయ భద్రతపై హైడ్రామా - దిగ్విజయ్ సింగ్​

భోపాల్​ని ఆర్​ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అవసరాల కోసం భద్రతా సిబ్బందిని వినియోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్లీ కాసేపటికే భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించారు.

ఆర్​ఎస్​ఎస్

By

Published : Apr 3, 2019, 12:41 AM IST

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లోని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి భద్రతను తొలగించింది కమల్​నాథ్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం. భద్రతా సిబ్బందిని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధుల వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు.​

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి తిరిగి భద్రత కల్పించాలని ట్విట్టర్​ ద్వారా ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను కోరారు భోపాల్ లోక్​సభ అభ్యర్థి, కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్.

"భోపాల్​లోని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి భద్రతను తొలగించడం సరైందికాదు. తక్షణమే భద్రతను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను కోరుతున్నా " - దిగ్విజయ్​ సింగ్​ ట్వీట్

దీనిపై స్పందించి వెంటనే ఆర్ఎస్ఎస్​ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించాలనిసీఎంఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి మొదట భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

చౌహాన్​ విమర్శలు..

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి భద్రత ఉపసంహరణపై ప్రభుత్వాన్ని విమర్శించారు భాజపా నేత,మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్. కారణం లేకుండానే ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయానికి భద్రతను తొలగించారని ఆరోపించారు. రక్షణ కావాలని సంఘ్​ ఎప్పుడూ పోలీసులను కోరలేదని... అందుకోసం ఇతరులపై ఆధారపడలేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details