తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్గి పండ్లతో రెండు ఊర్ల యుద్ధం- 40మందికి గాయాలు - madhyapradesh hingots festival

మధ్యప్రదేశ్​లో హింగోట్ ఉత్సవంలో భాగంగా రెండు గ్రామాలు చిన్నపాటి అగ్ని ఫిరంగులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు.

అగ్గి పండ్లతో రెండు ఊర్ల యుద్ధం- 40మందికి గాయాలు

By

Published : Oct 29, 2019, 3:25 PM IST

అగ్గి పండ్లతో రెండు ఊర్ల యుద్ధం- 40మందికి గాయాలు

మధ్యప్రదేశ్ ఇండోర్​ జిల్లాలో 'హింగోట్​ ఉత్సవం' సందడిగా సాగింది. ఈ పండుగలో భాగంగా గౌతమ్​పుర, రంగీ గ్రామాలకు చెందిన ప్రజలు అగ్ని మతాబులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు.

దీపావళి పండుగ తర్వాత రోజు ఏటా సంప్రదాయంగా ఇక్కడి ప్రజలు హింగోట్​ ఉత్సవం జరుపుకుంటుంటారు.

ఏమిటీ హింగోట్​?

హింగోట్​ అనేది ఒక మతాబులాంటిది. వీటి తయారీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. స్థానికంగా దొరికే ఒక పండులోని గుజ్జు తీసేసి... గన్​పౌడర్​, బొగ్గు, సల్ఫర్​ నింపుతారు. ఆ పండు కాడకు నిప్పుపెట్టి ఎదుటివారిపైకి విసురుతారు.

ఇదీ చూడండి: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే

ABOUT THE AUTHOR

...view details