'ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని.. నువ్వెంత' అంటూ పురిట్లోనే ఆ నవజాత శిశువుకు కరోనా సోకింది. కానీ మంచి చెడూ తెలియని ఆ నిఖార్సైన చిన్నారి వద్ద ఉండలేకపోయింది. నిర్మలమైన ఆ నవ్వు చూడలేక తోక ముడిచి పారిపోయింది. 12 రోజుల శిశువే కానీ 2 లక్షలమందికి పైగా బలి తీసుకున్న వైరస్‌ను ఓడించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
ఏప్రిల్ 7న భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. 11న డిశ్చార్జి అయ్యారు. అయితే పురిటి సమయంలో సహాయకురాలిగా ఉన్న ఉద్యోగికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అధికారులను సంప్రదించారు తల్లిదండ్రులు. ఇంట్లోని వారందరికీ పరీక్షలు చేసిన అధికారులు నవజాత శిశువుకు మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధరించారు. తల్లి సహా శిశువును ఆస్పత్రికి తరలించారు.