మాతృత్వపు మాధుర్యాన్ని పంచాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించింది. తన అయిదుగురు పిల్లలతో గంగానదిలో దూకేసింది. అనంతరం ఈదుకుంటూ బయటపడింది తల్లి. అయితే నదిలో మునిగిపోయిన పిల్లలు విగత జీవులుగా తేలారు. ఉత్తర్ప్రదేశ్ భదోహీ జిల్లా జహంగిరాబాద్ గంగా ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పిల్లలను గంగానదిలో పారేసిన తల్లి- అయిదుగురు మృతి - జహంగిరాబాద్
ఉత్తర్ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన అయిదుగురు పిల్లలతో కలిసి గంగానదిలో దూకేసింది. అనంతరం నదిలో నుంచి ఈదుకుంటూ బయటపడగా.. అయిదుగురు చిన్నారులు మృతి చెందారు.
ఉత్తర్ప్రదేశ్ జహంగిరాబాద్
నదిలో పిల్లల్ని పారేసినట్లు గ్రామస్థులకు సదరు మహిళ చెప్పటం వల్ల విషయం బయటపడింది. మహిళకు కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
మరణించిన చిన్నారుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. అందరి వయసు 11ఏళ్ల లోపే ఉన్నట్లు తెలుస్తోంది.