మమతలు పంచే ఓ తల్లి మనసు కర్కశంగా మారింది. ఆపదొస్తే అక్కున చేర్చుకోవాల్సిన అమ్మే క్షణికావేశంతో కన్నకూతురిని కడతేర్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఠానె, బద్లాపుర్కు చెందిన ఓ పోలీసు అధికారి భార్య మీనాబాయి అశోక్ పాటిల్. గురువారం మీనాబాయి బెడ్రూమ్లో నిద్రపోయే సమయానికి తన ఏడేళ్ల కూతురు కీర్తిక హాల్లో నాయనమ్మ కేవడ్బాయి దగ్గర పడుకుంది. రాత్రి 11.30 గంటలకు కీర్తికను తన గదిలోకి లాక్కెళ్లింది మీనా. కొద్దిసేపటి తర్వాత గదిలోంచి అరుపులు, శబ్దాలు వినబడ్డాయి. నాయనమ్మ కేవడ్బాయి పరుగెత్తుకెళ్లింది. కోడలు, మనవరాలు రక్తపు మడుగులో పడిఉండడం చూసి నిర్ఘాంతపోయింది.