జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 4,58,521 మంది అభ్యర్థులకు గానూ 3,43,958 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
"గత 3 రోజుల నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారు. కొవిడ్ -19 మహమ్మారిలోనూ ఆత్మ నిర్భర్ భారత్ అనే యజ్ఞంలో పాలుపంచుకోవటం కోసం చాలా మంది విద్యార్థులు పాల్గొనటం చాలా ఆనందం ఉంది.. విద్యార్థుల కెరీర్లపై ప్రభావం పడకుండా వారికి సహకరించిన ముఖ్యమంత్రులందరికీ నా ధన్యవాదాలు."