భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, రామ్ విలాస్ పాశవాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిల్లీలోని ఎయిమ్స్‌ను ఆదివారం సందర్శించారు. జెట్లీ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్‌కు వెళ్లిన వారిలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు.
జైట్లీ పరిస్థితి విషమం.. ఎయిమ్స్‌కు ప్రముఖులు - Jaitley
కేంద్ర మాజీ అర్థిక మంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీసేందుకు రాజకీయ ప్రముఖలు ఎయిమ్స్ తరలివెళ్తున్నారు. ఆగస్టు 9 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జైట్లీ. పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు.
ఎయిమ్స్‌కు రాజకీయ ప్రముఖులు.. జైట్లీ పరిస్థితిపై ఆరా
అనారోగ్యంతో ఆగస్టు 9న ఎయిమ్స్‌లో చేరారు జైట్లీ. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ఇదివరకే తెలిపారు.ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచారు.
Last Updated : Sep 27, 2019, 10:40 AM IST