తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షాలు, తుపానుల అంచనాపై మరింత కచ్చితత్వం! - Cyclone prediction

వాతావరణ మార్పులు, తుపానులను మరింత కచ్చితత్వంగా అంచనా వేయొచ్చని భారత్​-బ్రిటన్ సంయుక్తంగా చేపట్టిన ఓ పరిశోధన తేల్చింది. దక్షిణ బంగాళాఖాతంలో చేసిన పరిశోధనతో ఈ విషయాన్ని వెల్లడించింది.

rain
వర్షాలు, తుపానుల అంచనా.. ఇక కచ్చితంగా!

By

Published : Apr 30, 2020, 11:45 PM IST

వర్షాకాలం, తుపానులను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ (ఐఐఎస్​సీ). బ్రిటన్​కు చెందిన ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం సహా పలు భారతీయ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో వర్షపాతాన్ని ముందుగానే మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని తేల్చాయి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశమై పరిశోధన సాగించాయి.

"ఈ సాంకేతికత వినియోగం ద్వారా ఆసియాకు చెందిన రైతులు పంటలను ఎప్పుడు వేయాలో తెలుస్తుంది. కురవబోయే వర్షపాతం అంచనా ఆధారంగా ఏయే పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునేందుకు అవకాశం ఉంది."

-ఐఐఎస్​సీ ప్రకటన

ఐఐఎస్​సీలో వాతావరణ, సముద్ర శాస్త్ర విభాగ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న పీఎన్ వినయచంద్రన్, యూఏఈ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్​మెంటర్ సైన్స్​లో ప్రొఫెసర్​గా పనిచేసే ఆండ్రూ మాథ్యూస్ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది.

నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్​లో 'సముద్ర మిశ్రమ ఉపరితల ఉష్ణోగ్రత పరిశీలన-వాతావరణ మార్పు సమయంలో జరిగే చర్యలు' అనే వ్యాసంలో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు. ఈ పరిశోధనకు భారత భూ పర్యావరణ మంత్రిత్వ శాఖ, బ్రిటన్​కు చెందిన నేచురల్ ఎన్విరాన్​మెంట్ రీసెర్చ్ కౌన్సిల్ (నెర్క్) నిధులు అందించాయి. కొచ్చి శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం, సీఎస్​ఐఆర్, గోవా, విశాఖపట్నం కేంద్రాలు.. సముద్ర సమాచార సేవల సంస్థ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి.

"సముద్ర మార్పులు, ఉష్ణోగ్రతలు, లవణీయత, వేగం, సముద్ర జలాల్లో రేడియేషన్, ఉపరితల మిశ్రమం, వేడి ఉపరితల ప్రవాహాలను ఆర్​వీ సింధుసాధన అనే నౌక ద్వారా 2016లో అంచనా వేశాం. సముద్ర గ్లైడర్లు వంటి ఉపకరణాలతో 11 రోజులపాటు ఈ పరిశోధన సాగించాం."

-పరిశోధనలోని భాగం

ఇదీ చూడండి:రిషీకపూర్​కు సైకత శిల్పంతో నివాళులు

ABOUT THE AUTHOR

...view details