తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చేదు కబురు చెప్పింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఎల్నినోనే ప్రభావం చూపనుందని వెల్లడించింది. వర్షాకాలం రెండో కాలావధిలో దీని ప్రభావం తటస్థంగా ఉంటుందని పేర్కొంది వాతావరణ శాఖ.
జులైలో తక్కువ వర్షాలు పడినా ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.