ఈ ఏడాది జూన్లో 2014 తర్వాత అత్యంత కనిష్ఠ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే 33 శాతం తగ్గుదలతో 67 శాతానికే పరిమితమైనట్లు తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నీరు పూర్తిగా అడుగంటుకుపోయినట్లు కేంద్ర జల మండలి విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 91కి గానూ 62 ప్రధాన జలాశయాల్లో నీటి నిలువ సాధారణం కంటే తక్కువగా ఉంది.
దీర్ఘకాల సగటు అంచనా
దీర్ఘకాల సగటు 90 శాతం లోపు ఉంటే లోటు వర్షపాతం గానూ, 90 నుంచి 96 శాతం మధ్య ఉంటే సాధారణం కంటే తక్కువగానూ, 96 నుంచి 104 మధ్య నమోదైతే సాధారణంగానూ, 104 నుంచి 110 శాతం మధ్య ఉంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు.