తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2019, 7:05 PM IST

Updated : Oct 13, 2019, 11:15 PM IST

ETV Bharat / bharat

కుక్కపిల్లలపై పందుల దాడి.. కాపాడిన వానరం

కర్ణాటకలోని విజయపురలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. ఆపదలో చిక్కుకున్న కుక్క పిల్లను ఓ వానరం కాపాడింది. తల్లి ప్రేమకు జాతి వైరం అడ్డు కాదని నిరూపించింది.

కుక్కపిల్లలపై పందులు దాడి.. కాపాడిన వానరాలు

కుక్కపిల్లలపై పందులు దాడి.. కాపాడిన వానరాలు

కర్ణాటక విజయపుర జిల్లాలో మానవతా దృశ్యం కనువిందు చేసింది. జంతువుల్లో ఉన్న దయాగుణాన్ని మరోసారి చాటిచెప్పాయి వానరాలు. పందుల దాడి నుంచి కుక్కపిల్లను కాపాడి.. తమకూ మానవత్వం ఉందని నిరూపించాయి.

తల్లి నుంచి తప్పిపోయిన రెండు కుక్కపిల్లలపై కొన్ని పందులు దాడి చేయడాన్ని గమనించింది ఓ వానరం. పక్కన తల్లి శునకం లేనందున చిన్ని శునకాలకు హాని కలుగుతుందేమోనన్న భయంతో రక్షించేందుకు రంగంలోకి దిగింది. పందుల బారి నుంచి ఏదో విధంగా వాటిని తప్పించింది. అయితే అప్పటికే ఒక కుక్కపిల్ల ప్రాణాలు కోల్పోగా.. మరో పిల్లను తల్లి చెంతకు చేర్చింది.

హనుమంతుడు చేసిన అద్భుతం!

అప్పటివరకు పిల్లల కోసం వెతుకుతున్న తల్లి శునకానికి.. కోతి వద్ద అవి తారసపడ్డాయి. అయితే తల్లి శునకం వానరం వద్దకు వెళ్లడానికి వెనుకడుగు వేసింది. కానీ, కోతి మాత్రం కుక్క పిల్లకు తల్లి ప్రేమను పంచింది. ఇది హనుమంతుడు చేసిన అద్భుతంగా గ్రామస్థులు భావిస్తున్నారు.

Last Updated : Oct 13, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details