తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఆహ్వానం.. - SWEAR in

వరుసగా రెండోసారి ప్రధాన మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. అట్టహాసంగా జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సినీ పరిశ్రమ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. షారుక్​ ఖాన్, రాహుల్ ద్రవిడ్, ముకేశ్ అంబానీ వంటి దిగ్గజాలు హాజరవుతున్నారు.

ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఆహ్వానం..

By

Published : May 30, 2019, 6:51 AM IST

Updated : May 30, 2019, 7:54 AM IST

మోదీ ప్రమాణానికి ప్రముఖుల హాజరు

ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఘనంగా జరగనున్న ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సీనీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ముఖ్యులున్నారు.

రజనీ, షారుక్​...

సినీరంగం నుంచి సూపర్​స్టార్​ రజనీకాంత్, బాలీవుడ్​ అగ్రనటుడు షారుక్ ఖాన్​, కంగనా రనౌత్, కరణ్​ జోహార్​, సంజయ్ లీలా​ భన్సాలీలకు ఆహ్వానం అందింది.

ద్రవిడ్​, భజ్జీ...

క్రీడారంగం నుంచి ఆహ్వానం అందిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్​ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్​, హర్బజన్​ సింగ్ ఉన్నారు.

భారత బ్యాడ్మింటన్​ అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్​, కోచ్​ పుల్లెల గోపీచంద్​, జిమ్నాస్ట్​ దీపా కర్మాకర్​లతో పాటు ఒకప్పటి పరుగుల రాణి పి.టి ఉషలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అంబానీ, అదానీ, రతన్​ టాటా

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని బడా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్​ టాటాలతో పాటు అజయ్ పిరమాల్, జాన్​ చాంబర్స్, బిల్ గేట్స్​లకు ఆహ్వానం పంపారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎప్) ఎండీ, ఛైర్మన్ క్రిస్టైన్ లగార్డీకి ఆహ్వానం లభించింది.

దేశవిదేశాల నుంచి మొత్తం 8 వేల మంది అతిథులకు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వీరిలో ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్షాల నేతలు సహా ప్రపంచ దేశాధినేతలూ ఉన్నారు. దాదాపు 6 వేల మంది అతిథులు హజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10 వేల మంద్రి భద్రతా సిబ్బంది...

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ఎదుట జరిగే మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బహుళ అంచెల భద్రతతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. మోదీ సందర్శించబోయే రాజ్​ఘాట్, సదైవ్ అటల్​ సమాధి, జాతీయ యుద్ధ స్మారకం వంటి కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు.

ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రిగా అమిత్​షా..!

Last Updated : May 30, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details