తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు 15వ 'భారత్​-ఈయూ' సదస్సు.. మోదీ హాజరు - modi in EU summit

భారత్​-ఐరోపా సమాఖ్య 15వ సదస్సు నేడు సాయంత్రం వర్చువల్​గా జరగనుంది. ఇందులో పాల్గొననున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ సమావేశం ఐరోపా దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

India-European Union (EU) Summit
నేడు 15వ 'భారత్​-ఈయూ' సదస్సు

By

Published : Jul 15, 2020, 10:59 AM IST

15వ భారత్​-ఐరోపా సమాఖ్య(ఈయూ) సదస్సు నేడు వర్చువల్​గా జరగనుంది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత అధికారులు హాజరుకానున్నారు. ఈయూ నుంచి ఐరోపా కౌన్సిల్​ అధ్యక్షుడు చార్లెస్​ మిచెల్​, ఈయూ కమిషన్​ అధ్యక్షులు ఉర్సులా వాన్​ లెయెన్​ల నేతృత్వంలో అధికారులు పాల్గొననున్నారు.

భారత్​-చైనాల మధ్య సరిహద్దులో ఇటీవలే ఉద్రిక్తతలు తలెత్తినే తరుణంలో ఈ సదస్సుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సరిహద్దు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధాల బలోపేతం..

ఈరోజు సాయంత్రం 4.30గంటలకు జరిగే వర్చువల్​ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. ఈ సమావేశం ద్వారా ఐరోపా దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సరిహద్దు ప్రతిష్టంభనపై ఆందోళన..

ఇటీవలే భారత్​-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై ఆందోళన వ్యక్తం చేసింది ఐరోపా సమాఖ్య. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం అవసరమని పేర్కొంది. భారత్​-ఈయూ సదస్సుకు ఒక రోజు ముందు ఈ మేరకు అభిప్రాయపడింది. రెండు శక్తివంతమైన దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు ఈయూ సీనియర్​ అధికారి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

బుధవారం జరిగే భారత్​-ఈయూ సదస్సులో సరహద్దు సమస్య చర్చకు వస్తుందా అనే విషయాన్ని నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ.. ప్రాంతీయ, గ్లోబల్​ సమస్యలకు సాధారణంగా ప్రాధ్యానం ఉంటుందని అధికారి పేర్కొన్నారు. చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలతో సంబంధాలు చాలా ముఖ్యమని.. అలాంటివి సాధారణంగా చర్చలకు వస్తాయన్నారు.

అతిపెద్ద వాణిజ్య భాగస్వామి..

2018లో ఐరాపా సమాఖ్య.. భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2018-19లో 115.6 బిలియన్​ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్​ సుమారు 57.17 బిలియన్​ డాలర్ల ఎగుమతులు చేయగా.. 58.42 బిలియన్​ డాలర్ల దిగుమతులు చేసుకుంది.

ఇదీ చూడండి: 'అయోధ్య ఓ బౌద్ధ క్షేత్రం.. ఆలయ నిర్మాణం ఆపండి'

ABOUT THE AUTHOR

...view details