కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మరో మూడు సంస్థలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు భేటీకానున్నారు. వర్చువల్గా ఈ సమావేశం జరగనుందని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జెనోవా బయోఫార్మా, బయెలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోదీ మాట్లాడనున్నారని తెలిపింది.
"కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వాములైన మూడు సంస్థలతో ఈ నెల 30న వర్చువల్గా నరేంద్ర మోదీ సమావేశం అవ్వనున్నారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు."