తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 26న నరేంద్ర మోదీ నామినేషన్​ - april 26

వారణాసి లోక్​సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల​ 26న నామపత్రం దాఖలు చేయనున్నారు. దీనికోసం రెండు రోజుల భారీ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

నరేంద్రమోదీ

By

Published : Apr 16, 2019, 6:48 AM IST

Updated : Apr 16, 2019, 8:38 AM IST

ప్రధాని నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామపత్రం దాఖలుకు ముహూర్తం ఖరారైంది. వారణాసి లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయనున్న మోదీ.. ఈ నెల 26న నామినేషన్​ వేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం.

రెండు రోజుల కార్యక్రమం

ఈ నెల 25న వారణాసికి మోదీ బయలుదేరనున్నారు. అదే రోజు బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమయ్యే రోడ్​ షోలో పాల్గొన్న తర్వాత కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం స్థానిక కార్యకర్తలు, మేధావులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. ​ 26న కాశీ విశ్వనాథ​ ఆలయాన్ని దర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్​ షో ద్వారా వెళ్లి నామపత్రం దాఖలు చేస్తారు.2014లోనూ మోదీ ఇదే సంప్రదాయాన్ని పాటించారు.

గత ఎన్నికల్లో గుజరాత్​లోని వడోదరా, ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేశారు మోదీ.

సార్వత్రిక ఏడో దశ ఎన్నికల్లో భాగంగావారణాసిలో మే 19న పోలింగ్​ జరుగుతుంది.

ఇదీ చూడండి:'ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం'

Last Updated : Apr 16, 2019, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details