అత్యంత అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు. దిల్లీలో మేఘాలు అడ్డుగా ఉన్న కారణంగా నేరుగా చూడలేకపోయినట్లు ట్వీట్ చేశారు. కేరళ కోజికోడ్‌లో గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసినట్లు వెల్లడించారు మోదీ.
"చాలా మంది భారతీయులలాగా నాకూ సూర్యగ్రహణం ఎంతో ఆసక్తిని కలిగించింది.దురదృష్టవశాత్తూ మేఘాలు అడ్డుగా ఉన్న కారణంగా దిల్లీలో ప్రత్యక్షంగా చూడలేకపోయాను. కానీ కోజికోడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించాను. నిపుణులతో కాసేపు ముచ్చటించి ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకున్నాను."