తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రతి భారతీయుడు కాపలాదారే'

సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలను భాజపా ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ " మై బీ చౌకీదార్" అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

'ప్రతీ భారతీయుడు కాపలాదారే'

By

Published : Mar 16, 2019, 12:41 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో మెదటి విడత పోలింగ్​కు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. భాజపా ప్రచార కార్యక్రమాలూ ఊపందుకున్నాయి. 'మోదీ హైతో ముమ్కిన్​ హై' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించింది భాజపా.

ప్రధాని తాజాగా "మై బీ చౌకీదార్​ (నేనూ కాపలాదారే)" అంటూ తన మద్దతుదారులకు ట్విట్టర్​ వేదికగా దిశానిర్దేశం చేశారు. ఈ ప్రచారానికి సంబంధించిన 3 నిమిషాల వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేశారు ప్రధాని. ఇందులో ఎన్​డీఏ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించారు.

"మీ కాపలాదారు దృఢంగా నిలబడి దేశం కోసం సేవలందిస్తున్నాడు. కానీ ఒంటరిగా కాదు. అవినీతి, అపరిశుభ్రత, సామాజిక రుగ్మతులపై పోరాడే ప్రతీ ఒక్కరూ కాపాలాదారే... దేశాభివృద్ధికోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కాపలాదారే.. ప్రతి భారతీయుడు 'మై బీ చౌకీదార్​' ప్రతిజ్ఞ చేయాలి."
-ట్విట్టర్​​లో ప్రధాని

'చౌకీదార్​ చోర్​ హై' అంటూ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మోదీపై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు. రఫేల్ ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారని రాహుల్​ ఆరోపిస్తున్నా... మోదీ 'చౌకీదార్​' నినాదంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details