ప్రధాని నరేంద్రమోదీ 70వ వసంతంలోకి అడుగిడిన వేళ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, పుట్టిన రోజు నాడు ఆయన ఏం కోరుకుంటున్నారన్న ప్రశ్నకు మోదీ ఇలా బదులిచ్చారు.
"నా పుట్టినరోజు కానుకగా ఏం కావాలని చాలా మంది అడిగారు. నేను కోరుకునేది ఇదే..
ఎల్లప్పుడూ మాస్కు వాడాలి. అదీ కూడా సరిగ్గా ధరించాలి.
భౌతిక దూరం పాటించాలి. కనీసం రెండు అడుగుల దూరమని గుర్తుపెట్టుకోంది.
రద్దీగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.