కుటుంబ ప్రయోజనాల కోసం దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి.. ప్రజలకు సొంత ఇళ్లు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి ఆ పనిని భాజపా చేసి చూపిస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.
తనను నటుడన్న కాంగ్రెస్ విమర్శలపై ధీటుగా స్పందించారు మోదీ. రిమోట్ కంట్రోల్‌తో దేశాన్ని పాలించిన వారిముందు ఎవరైనా దిగదుడుపేనని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీకి చెందిన లండన్‌లోని ఓ సంస్థకు కాంగ్రెస్ హయాంలో రక్షణ శాఖకు సంబంధించిన జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టారని ఆరోపించారు మోదీ. దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.