తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ పాకిస్థాన్ బాకా ఊదుతోంది: మోదీ - కాంగ్రెస్​

కాంగ్రెస్​ పార్టీ పాకిస్థాన్​కు మద్దతు పలుకుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మణిపుర్​లోని ఇంఫాల్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి భాజపా ఎంతో కృషి చేస్తోందన్నారు.

కాంగ్రెస్​ పాకిస్థాన్ బాకా ఊదుతోంది:మోదీ

By

Published : Apr 7, 2019, 8:21 PM IST

మణిపుర్​ రాజధాని ఇంఫాల్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాకిస్థాన్​కు మద్దతు పలుకుతోందని ఆరోపించారు. హస్తం పార్టీ.. మోసాల పత్రం పాకిస్థాన్​కే బాకా ఊదేలా ఉందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ పాకిస్థాన్ బాకా ఊదుతోంది:మోదీ

"పాకిస్థాన్​ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనుకున్న విషయాన్నే కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతున్నారు. జమ్ము కశ్మీర్​లో ఇద్దరు ప్రధానమంత్రులు ఉండాలనుకున్నవారికే కాంగ్రెస్​ మద్దతునిస్తోంది. కాంగ్రెస్​ పార్టీ 'మోసాల' పత్రం చూస్తే భారత దేశం కన్నా పాకిస్థాన్​కే ఎక్కువ బాకా ఊదుతోందని స్పష్టమవుతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కాంగ్రెస్​ పాలనలో రాష్ట్రం దయనీయ స్థితిలో ఉండేదని... భాజపా పాలనలో ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని ప్రధాని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details