తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం అమిత్​షా ఆధ్వర్యంలో మిత్రపక్షనేతలకు విందు ఏర్పాటు చేశారు.

By

Published : May 21, 2019, 9:38 PM IST

Updated : May 21, 2019, 11:11 PM IST

ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ.... కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే ముందు ఈ ఐదేళ్లు దేశ ప్రజలకు సేవచేసినందుకుగాను మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

"నేను ఎన్నో ఎన్నికలను చూశాను కానీ ఇది రాజకీయాలకు అతీతమైనది. ప్రజలే పోరాడుతున్నారు. నేను చాలా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాను. కానీ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినపుడు తీర్థయాత్రలు చేసినట్లు అనిపించింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ వ్యాఖ్యలను మోదీనే స్వయంగా చెప్పినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ విలేకరులతో పేర్కొన్నారు.

భాజపా అధ్యక్షుడు అమిత్​షా అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ ​పోల్స్​ ఫలితాలు, 23న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రులు రాజ్​నాథ్​సింగ్​, అరుణ్​జైట్లీ, నితిన్​ గడ్కరీ, జేపీ నడ్డా, ప్రకాశ్​ జావడేకర్​ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షనేతలు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మోదీకి పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. మోదీ సర్కార్​కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు అమిత్​ షా. ఐదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించారని కొనియాడారు.

సమావేశం అనంతరం హోటల్​ అశోకాలో ఎన్డీఏ నేతలకు అమిత్​షా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు భాజపా మిత్రపక్ష నేతలు నితీశ్​కుమార్​, ఉద్ధవ్​ ఠాక్రే, రామ్​విలాస్​ పాసవాన్​ సహా ఎన్డీఏ ప్రముఖ నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఓటమిని వినమ్రంగా స్వీకరించండి: భాజపా

Last Updated : May 21, 2019, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details