సార్వత్రిక ఎన్నికల 5 దశల పోలింగ్ పూర్తయ్యేసరికి ఓటమి ఖాయమని బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గ్రహించారని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే తనపై అనుచిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
బంగాల్ పురూలియాలో ఎన్నికల ప్రచారం చేశారు మోదీ. ఇటీవల మమతా బెనర్జీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేశారు ప్రధాని.
"నేను మిమ్మల్ని 'దీదీ' అని సంబోధిస్తాను. మిమ్మల్ని గౌరవిస్తాను. మీ చెంపదెబ్బలు కూడా నాకు ఆశీర్వాదాలు అవుతాయి. చిట్ఫండ్ పేరుతో పేద ప్రజల డబ్బును దోచుకున్న వారిని చెంప దెబ్బలు కొట్టే ధైర్యముంటే అంతగా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. మాతృమూర్తి, మట్టి, మనుషులు అని మాటలు చెప్పి దీదీ ఓట్లు పొందారు. కాని ప్రస్తుతం బంగాల్ ఏ స్థితిలో ఉంది?."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: రాహుల్ పౌరసత్వంపై వ్యాజ్యం కొట్టివేత