తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు మరో మార్గం లేకుండా చేశాం: మోదీ

పాకిస్థాన్​ విషయంలో కాంగ్రెస్​ వైఖరిని ప్రధాని నరేంద్రమోదీ తప్పుబట్టారు. ఆ దేశానికి, ప్రధానికి మద్దతుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరియాణా కురుక్షేత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... ప్రపంచంలో పాకిస్థాన్​ను ఒంటరిగా నిలిపామన్నారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : May 8, 2019, 3:57 PM IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్​ను దారికి తెచ్చే విషయంలో గత కాంగ్రెస్​ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్డీఏ సర్కారు మాత్రం పాక్​ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని చెప్పారు.

హరియాణా కురుక్షేత్రలో భాజపా ప్రచార సభలో ప్రసంగించారు మోదీ.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"వాయుదాడుల తర్వాత మన వీర పుత్రుణ్ని పాకిస్థాన్​ పట్టుకుంది. అయితే 48 గంటల్లోనే ఆయన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. వాఘా సరిహద్దుకు వచ్చి మనకు వాళ్లు అప్పగించారు. అప్పుడు వాళ్ల ముఖాలు చూసే ఉంటారు మీరు. భారత విదేశాంగ విధానమే అందుకు కారణం. కానీ కాంగ్రెస్ మాత్రం పాకిస్థాన్​ ప్రభుత్వాన్ని కీర్తించింది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

రాజీవ్​గాంధీని విమర్శించడంపై కాంగ్రెస్​ నేతల మాటల దాడిని ప్రధాని తిప్పికొట్టారు. విపక్ష నేతలు తనను ఎన్నోసార్లు పరుష పదజాలంతో దూషించారని అన్నారు.

ఇదీ చూడండి: కేంద్రంలో 'కిచిడీ సర్కార్' లేనట్టే: మోదీ

ABOUT THE AUTHOR

...view details