తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే రాష్ట్రంలో నేడు మోదీ, రాహుల్​ ప్రచారం - loksabha

మహారాష్ట్రలో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ముంబయిలో నేటి సాయంత్రం జరిగే సభకు హాజరవుతారు మోదీ. షిరిడీ లోక్​సభ పరిధిలోని సంగంనేర్​లో జరిగే సభలో రాహుల్​ గాంధీ ప్రసంగిస్తారు.

నేడు మహారాష్ట్రలోమోదీ ా

By

Published : Apr 26, 2019, 6:21 AM IST

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ, మహారాష్ట్రలోని లోక్​సభ స్థానాలకు చివరి దశ పోలింగ్​ ప్రచారానికి రెండు రోజుల్లో గడువు ముగియనుంది. ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. నేడు మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్​లో నేటి సాయంత్రం జరిగే సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. దాదాపు అదే సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా సంగంనేర్​లో జరిగే సభకు హాజరవుతారు కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ.

మహారాష్ట్ర కంటే ముందు నేడు మధ్యప్రదేశ్​కు వెళ్తారు ప్రధాని మోదీ. సిధి, జబల్​పుర్​లో జరిగే సభల్లో పాల్గొంటారు.

మహారాష్ట్రలోని 17లోక్​సభ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్​ జరగనుంది. మొత్తం 323 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థులు మిలింద్​ దియోరా, నటి ఊర్మిళ మతోంద్కర్​, కేంద్రమంత్రి సుభాష్​ భమ్రే సహా మరికొందరు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాల పోలింగ్​ ఈ దశలోనే జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details