ఫిర్ ఏక్ బార్... మోదీ సర్కార్...! అబ్ కీ బార్... 300 పార్...! భాజపా ప్రచార నినాదాలు ఇవి. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఈ నినాదాలు నిజమైనట్లే కనిపిస్తోంది.
'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!' - EXIT
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. తుదిదశ పోలింగ్ ముగిసిన కాసేపటికే తమ సర్వేలను బయటపెట్టిన వేర్వేరు సంస్థలన్నీ మోదీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కడం ఖాయమని తేల్చేశాయి. ఎన్డీఏ కూటమి 280 నుంచి 330 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయా సంస్థలు అంచనా వేశాయి.
'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'
కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దాదాపు 300 సీట్లు గెలుస్తుందని లెక్కగట్టాయి. కమల వికాసం ముందు హస్తవాసి పనిచేయలేదని చెప్పాయి.
ఎన్డీఏ కూటమి 280 నుంచి 330 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయా సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్, మిత్రపక్షాలు 120 నుంచి 140 స్థానాలకు మించవని తేల్చాయి. ఇతరులు 100 స్థానాలకుపైగా గెలిచే అవకాశముందని పేర్కొన్నాయి.
- ఇదీ చూడండి: ఎగ్జిట్‌పోల్స్ కుట్రలో భాగం : మమతా బెనర్జీ