తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రదాడులపై మోదీ దిగ్భ్రాంతి - హెల్ప్​లైన్

న్యూజిలాండ్​ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సానుభూతి తెలుపుతూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్​కు లేఖ రాశారు.

ఉగ్రదాడులపై మోదీ దిగ్భ్రాంతి

By

Published : Mar 16, 2019, 7:32 AM IST

న్యూజిలాండ్ మసీదుల్లో దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మసీదులపై దాడులు అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఘటనపై సానుభూతి తెలుపుతూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్​కు లేఖ రాశారు.

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని మోదీ ఉద్ఘాటించారు. వారికి మద్దతునిచ్చే వారిపై ఎట్టిపరిస్థితుల్లోనైనా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు భారత ప్రధాని. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో న్యూజిలాండ్ పౌరులకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

హెల్ప్​లైన్ ఏర్పాటు

దాడిలో బాధితులైన భారతీయుల సమాచారం కోసం న్యూజిలాండ్​లోని భారత దౌత్య కార్యాలయం హెల్ప్​లైన్ ఏర్పాటు చేసింది. ఎటువంటి సహకారం కోసమైనా తమను సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించారు.

"న్యూజిలాండ్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మా బృందం సేకరిస్తోంది. అయితే అత్యంత సున్నితమైన విషయమైనందున కొన్ని పరిమితులను పాటిస్తున్నాం. పూర్తి సమాచారం తెలిసే వరకు మరణించినవారి పేర్లు, సంఖ్య ప్రకటించవద్దని నిర్ణయించాం."
-రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

వివరాలు, సహాయార్థం 021803899/50033 నంబర్లతో హెల్ప్​లైన్ ఏర్పాటు చేశామని న్యూజిలాండ్​లోని భారత హైకమిషన్ తెలిపింది. అధికారిక వివరాల ప్రకారం సుమారు రెండు లక్షల మంది భారతీయులు న్యూజిలాండ్​లో నివసిస్తున్నారు. అందులో 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు.

ఇదీ చూడండి:ఉగ్ర నరమేధానికి 49 మంది బలి

ABOUT THE AUTHOR

...view details