"మై బీ చౌకీదార్ హూ"... అంటే "నేనూ సంరక్షకుడినే". రఫేల్ వ్యవహారంలో విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ... ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఇది. మోదీ మొదలు, కేంద్రమంత్రులు, భాజపా సీనియర్ నేతలు, కార్యకర్తలు... ఇప్పటికే ట్విట్టర్లో పేరుకు ముందు చౌకీదార్ పదం చేర్చుకున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ భాజపా కార్యకర్తలు మరో అడుగు ముందుకేశారు. "మై బీ చౌకీదార్ హూ" అని చేతులపై పచ్చబొట్టు వేయించుకుంటున్నారు.
రాజకీయమే సరికొత్త ఫ్యాషన్ - మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 'చౌకీదార్ మోదీ' అంటూ ట్విటర్ ఖాతాలో పేరు మార్చుకున్నాక దేశంలో 'మై బీ చౌకీదార్ హూ' అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రధాని ప్రచార నినాదాన్ని చేతులపై పచ్చబొట్టు వేయించుకొని ప్రచారం చేస్తున్నారు కమలదళం సభ్యులు.
పచ్చబొట్టు
ఏడేళ్లుగా ట్యాటూలు వేస్తున్నాను. మోదీ పాలన బాగుంది. మరోసారి అధికారంలో వస్తే ఇంకా మంచి పనులు చేస్తారనే నమ్మకం ఉంది. నా వంతు ప్రచారం నిర్వహించాలని నిశ్చయించుకున్నాను. అందుకే 'మై బీ చౌకీదర్ హూ' ట్యాటూను ఉచితంగా వేస్తున్నాను. వారం పాటు ఈ ఉచిత ట్యాటూల కార్యక్రమం నిర్వహిస్తాను.-హరి నథానీ, భోపాల్
Last Updated : Mar 18, 2019, 12:53 PM IST