తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ కాశీవాసిని దీవించండి: నరేంద్ర మోదీ

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్​ నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ కాశీ వాసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగ సందేశం పంపారు. వారణాసి ప్రజలకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. వారణాసి నియోజకవర్గం నుంచి రెండోసారి లోక్​సభకు చేరుకునేందుకు మార్గం సుగమం చేయాలని అభ్యర్థించారు.

By

Published : May 15, 2019, 6:22 AM IST

Updated : May 15, 2019, 7:58 AM IST

ఈ కాశీవాసిని దీవించండి: నరేంద్ర మోదీ

ఈ కాశీవాసిని దీవించండి: నరేంద్ర మోదీ

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భావోద్వేగ సందేశం అందించారు. వారణాసి నియోజకవర్గం నుంచి రెండోసారి లోక్​సభకు చేరుకునేందుకు ప్రజల దీవెనలు కావాలని అభ్యర్థించారు.

ఎన్నికల్లో తనను మరోమారు ఆశీర్వదించాలని వీడియో సందేశం ద్వారా ప్రధాని మోదీ వారణాసి ప్రజలను కోరారు.

తాను కాశీవాసుడినని... ఈ పట్టణంతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని తెలిపారు మోదీ. ఒక్కసారి వచ్చినా కాశీతో విడదీయలేని బంధం ఏర్పడుతుందన్నారు.

వారణాసి వంటి పుణ్యభూమికి సేవలందించడం ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు. కాశీలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఎన్నికల్లో మోదీ విజయం కోసం కాశీలో ఉండే ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారని తెలిపారు.

" నా రాజకీయ, ఆధ్యాత్మిక జీవితానికి దిశానిర్దేశంలో, నా అభివృద్ధిలో కాశీ కీలకపాత్ర పోషించింది. కాశీ అంటే నాకు రెండు అక్షరాలు మాత్రమే కాదు. నా రోమరోమాల్లో ఇంకిపోయిన ఆధ్యాత్మికత, ధర్మం, సంస్కృతికి కారణం కాశీ. మీరు నన్ను ఎన్నుకుని కాశీలాంటి పుణ్యభూమికి సేవలందించేందుకు అవకాశం కల్పించటం నా అదృష్టం. కాశీ వాసులందరూ నరేంద్ర మోదీగా మారి ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఏం చేయాలో..ఏం చేయకూడదో, ఎందుకు చేయాలో..ఎందుకు చేయకూడదో అన్నీ కాశీ ప్రజలకు తెలుసు. జరుగుతున్న ఓట్ల పండుగలో మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను. మీ అందరి మదిలో కమలం ఉందని విశ్వసిస్తున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్​లో భాగంగా ఈ నెల 19న వారణాసి స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:రాళ్లదాడిపై భాజపా- తృణమూల్​ మాటల యుద్ధం

Last Updated : May 15, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details