తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

పోలీస్ అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజలను రక్షించడంలో ప్రాణాలొదిలిన పోలీసులకు నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. ఈ మేరకు అమరవీరుల త్యాగాలను కొడియాడుతూ మోదీ ట్వీట్​ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా సైతం దిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు.

'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'
'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

By

Published : Oct 21, 2020, 10:16 AM IST

Updated : Oct 21, 2020, 12:10 PM IST

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగాబుధవారం ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు. శాంతిభద్రతలు కాపాడటం నుంచీ అత్యంత క్లిష్టమైన నేరాల్ని ఛేదించేవరకు పోలీసులు చేస్తోన్న కృషిని ప్రధాని కొనియాడారు. కొవిడ్​-19 కట్టడిలో భాగంగా పోలీసుల చేస్తోన్న సేవలను అభినందించారు.

"దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలపటమే అమరవీరుల దినోత్సవానికి నిజమైన అర్థం. ప్రజలకు సేవచేసేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇది మనం గర్వించాల్సిన విషయం. వారి త్యాగాలు మరువలేనివి."

----- ప్రధాని మోదీ.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్​షా దిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొవిడ్ -19పై పోరులో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Last Updated : Oct 21, 2020, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details