తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ను గెలిపిస్తే అవినీతికి అనుమతిచ్చినట్లే' - కోజీకోడ్

దేశంలో అతిపెద్ద కుంభకోణం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 'తుగ్లక్​ రోడ్' కుంభకోణంగా మధ్యప్రదేశ్​లో బయటపడిన డబ్బు ఉదంతంపై కేరళ లోని కోజికోడ్​లో జరిగిన సభలో ప్రస్తావించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.

'కాంగ్రెస్​ను గెలిపిస్తే అవినీతికి అనుమతిచ్చినట్లే'

By

Published : Apr 12, 2019, 10:19 PM IST

కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కేరళలోని కోజికోడ్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్​ పార్టీలను గెలిపిస్తే అవినీతికి అనుమతి మంజూరు చేసినట్లేనని ఎద్దేవా చేశారు.

భాజపా ఎన్నికల ప్రణాళిక సంకల్ప్​ పాత్రలో దేశాభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాల్ని చేర్చామని స్పష్టం చేశారు. ఎన్డీఏకు మద్దతివ్వాలని నూతనంగా ఓటు హక్కును వినియోగించుకోనున్న యువ ఓటర్లకు విన్నవించారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తే అవినీతికి అనుమతిచ్చినట్లే: మోదీ

"కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను గెలిపించడం అవినీతికి లైసెన్సులు మంజూరు చేసినట్లే.దేశంప్రస్తుతం కాంగ్రెస్​కు చెందిన పెద్ద కుంభకోణం గురించి చర్చిస్తుంది. ఇది తుగ్లక్​ రోడ్ ఎన్నికల కుంభకోణం. మధ్యప్రదేశ్​లో కోట్లరూపాయలు, బ్యాగుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ అవినీతికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ డబ్బంతా దిల్లీ తుగ్లక్​ రోడ్డు​లోని ఓ కాంగ్రెస్​నేత ఇంటికి చేరుకున్నాయి. అక్కడ ఎవరు నివాసం ఉంటారో తెలుసా?. ఈ సొమ్ము మహిళలకు, చిన్నారులకు పోషకాహారం అందించాల్సిన డబ్బు నుంచి అవినీతి చేశారు. చాలాకాలం తర్వాత ఆ రాష్ట్రంలో వారు అధికారంలోకి వచ్చారు. వారు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో అవినీతికి పాల్పడ్డారు."- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details