తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ.. అగ్నిప్రమాదం మిమ్మల్ని కాపాడలేదు'

దిల్లీలోని శాస్త్రి భవన్​లో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఆ ఘటనలో భవనంలోని బూడిదైన దస్త్రాలు మోదీని ఏ మాత్రం కాపాడలేవని విమర్శించారు. మోదీ అవినీతిపై అంతిమ తీర్పు సమీపంలోనే ఉందని అన్నారు.

'మోదీ.. అగ్నిప్రమాదం మిమ్మల్ని కాపాడలేదు'

By

Published : Apr 30, 2019, 8:01 PM IST

Updated : Apr 30, 2019, 10:55 PM IST

'మోదీ.. అగ్నిప్రమాదం మిమ్మల్ని కాపాడలేదు'

దిల్లీలోని శాస్త్రిభవన్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆహుతైన దస్త్రాలు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాపాడలేవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ విమర్శించారు. మోదీ అవినీతిని బట్టబయలు చేసే అంతిమ తీర్పు సమీపంలోనే ఉందని రాహుల్​ ట్వీట్​ చేశారు.

"మోదీజీ...అగ్నికి ఆహుతైన దస్త్రాలు మిమ్మల్ని రక్షించలేవు. మీ (అవినీతి)పై త్వరలోనే అంతిమ తీర్పు వెలువడుతుంది."- రాహుల్​గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్వీట్​

కీలక పత్రాలు బూడిద

దిల్లీలోని శాస్త్రిభవన్​ ఆరో అంతస్తులో నేటి మధ్యాహ్నం మంటలు వ్యాపించాయి. అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పలు ప్రభుత్వ దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. న్యాయ, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖలు, కార్పొరేట్​ వ్యవహారాలు, రసాయనాలు, పెట్రోకెమికల్స్​, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖలకు చెందిన పలు కీలక దస్త్రాలు బూడిదయ్యాయి.

శాస్త్రి భవన్​లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: 'అప్పుడు కౌన్​ బనేగా పీఎం..ఇప్పుడు దాగుడుమూతలు'

Last Updated : Apr 30, 2019, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details