తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు కౌన్​ బనేగా పీఎం..ఇప్పుడు దాగుడుమూతలు' - కౌన్​ బనేగా పీఎం

విపక్షాలపై ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్ని రోజులు 'కౌన్​ బనేగా ప్రధానమంత్రి' ఆటలు ఆడిన విపక్షాలు... ఇప్పుడు దాగుడుమూతలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్​ బారాబంకీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... విపక్షాల ప్రధాని కుర్చీ కలలకు ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు.

"అప్పుడు కౌన్​ బనేగా పీఎం..ఇప్పుడు దాగుడుమూతలు"

By

Published : Apr 30, 2019, 7:05 PM IST

ఉత్తరప్రదేశ్​లోని బారాబంకీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. విపక్ష మహాకూటమి నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. నాలుగు దశల పోలింగ్​ అనంతరం విపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి సమాధానం చెప్తారని అన్నారు.

విపక్షాలపై ప్రధాని 'కౌన్​ బనేగా పీఎం' వ్యంగ్యాస్త్రం

"ఎవరైతే ఇన్ని రోజులు 'కౌన్​ బనేగా ప్రధానమంత్రి' ఆటలు ఆడారో... నాలుగు దశల పోలింగ్​ అనంతరం దాగుడుమూతలు ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. ఒకరిపై ఒకరు నిలబడి ప్రధాని కుర్చీ అందుకోవాలని కలలు కంటున్నారు. కానీ నాలుగు దశల పోలింగ్ తర్వాత వారి కలలను ప్రజలు చిత్తుచిత్తు చేశారు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి:'అమ్మా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details