తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని 'ఆధ్యాత్మిక, అభివృద్ధి' యాత్ర - modi

కేదార్​నాథ్​ ఆలయాన్ని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను సమీక్షించారు.

కేదార్​నాథ్​లో ప్రధాని 'ఆధ్యాత్మిక, అభివృద్ధి' యాత్ర

By

Published : May 18, 2019, 10:43 AM IST

Updated : May 18, 2019, 3:37 PM IST

ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గత రెండేళ్లలో ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం రెండు రోజుల యాత్రను చేపట్టారు ప్రధాని. రేపు బద్రీనాథ్​ ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

కేదారనాథుడిని దర్శించుకున్న అనంతరం అక్కడి కొండ ప్రాంతాల్లో పలు పునరుద్ధరణ పనులను పరిశీలించారు మోదీ. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు ఉత్తరాఖండ్​ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

శీతకాల విరామం అనంతరం భక్తుల దర్శనం కోసం కేదార్​నాథ్​, బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఈ నెల మెుదట్లోనే తెరుచుకున్నాయి.

ప్రధాని 'ఆధ్యాత్మిక, అభివృద్ధి' యాత్ర

ఇదీ చూడండి: ఎగ్జిట్​ పోల్స్​ ఓటరు నాడి పట్టుకుంటున్నాయా​?

Last Updated : May 18, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details