తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజలు, దేశాలను విభజించేందుకే కొత్త వైరస్​లతో కుట్ర' - 'వైరస్​పై ఐక్యంగా పోరాడుదాం'

వైరస్​పై ఐక్య పోరాటం సాగించాలని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నామ్​ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో సోదర భావాన్ని చాటుతూ... దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పారు.

modi
నామ్​ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం

By

Published : May 4, 2020, 9:16 PM IST

Updated : May 4, 2020, 11:29 PM IST

కరోనా వైరస్ ప్రపంచం పరిమితులను గుర్తు చేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పారదర్శకత, సమానత్వం, మానవత్వం వంటి సుగుణాలతో నూతన ప్రపంచీకరణ ఉండాలని పేర్కొన్నారు. నామ్ సదస్సును(అలీన దేశాల ఉద్యమం) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించిన ఆయన.. గత కొన్ని దశాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరోనానే అని చెప్పారు.

భారత్​ పాత్ర కీలకం..

కరోనాపై పోరులో భారత్ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు మోదీ. ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో సోదర భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

నామ్ సదస్సులో మోదీ

" మేం 123 దేశాలకు పైగా వైద్య సామగ్రి పంపిస్తున్నాం. ఇందులో 59 నామ్ సభ్య దేశాలు ఉన్నాయి. మేం ప్రపంచదేశాలతో కలిసి ఔషధాలు, వ్యాక్సిన్ తయారీలో చురుకుగా పాల్గొంటున్నాం. అత్యంత ప్రాచీన మొక్కల ఆధారంగా తయారయ్యే సంప్రదాయ ఔషధాలు కలిగిన దేశం భారత్​. చాలా సాధారణమైన ఆయుర్వేద, హోమియో మందులను ప్రజలు వారి రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు అందిస్తున్నాం. ప్రపంచం కరోనాపై పోరాడుతున్న వేళ కూడా.. కొంతమంది మరికొన్ని వైరస్​లను వ్యాప్తి చేస్తున్నారు. ఉగ్రవాదం, తప్పుడు వార్తలు, మార్చిన వీడియోలను ప్రజలను, దేశాలను విభజించేందుకు వ్యాప్తి చేస్తున్నారు. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఐక్యత చాటుదాం..

కరోనాపై పోరులో ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని ఉద్ఘాటించారు మోదీ. భారతీయ నాగరికత ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంలా చూస్తుందని చెప్పారు. ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ అలీన ఉద్యమం దేశాలకు సహకారం అందించడంలో ముందుండాలన్నారు.

ఇదీ చూడండి:'విదేశాల్లోని భారతీయులు మే 7 నుంచి స్వదేశానికి'

Last Updated : May 4, 2020, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details