'చౌకీదార్ చోర్ హై' అంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలనే సార్వత్రిక ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేరుకు ముందు 'చౌకీదార్' పదాన్ని జత చేశారు మోదీ.
ప్రతి భారతీయుడు చౌకీదార్ ప్రతిజ్ఞ చేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇటీవలే పిలుపునిచ్చారు మోదీ. ఆచరణను తన నుంచే మొదలు పెట్టారు.