తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతిపై విపక్షాలకు మోదీ బహిరంగ సవాల్ - alliance

అవినీతిపై విపక్షాలకు ప్రధాని నరేంద్రమోదీ సవాల్​ విసిరారు. తన వద్ద లెక్కకు మించి ఆస్తులున్నట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్​ బల్లియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : May 14, 2019, 1:48 PM IST

Updated : May 14, 2019, 2:03 PM IST

మహాకూటమి చేస్తున్న ఆరోపణలకు ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్​ బల్లియా బహిరంగ సభలో ప్రసంగించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి నేతలు అఖిలేశ్​ యాదవ్​, మాయావతిపై నిప్పులు చెరిగారు మోదీ.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"అత్త-అల్లుడు (మాయావతి-అఖిలేశ్) ఇద్దరూ కలిసి ఎన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారో.. అంతకన్నా ఎక్కువ సమయం గుజరాత్​ సీఎంగా ఉన్నా. నేను ఎన్నో ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాను. ఇప్పుడూ ఉన్నాను. ఎప్పుడూ కులాన్ని వాడుకుని గెలువలేదు. మహాకుటమికి బహిరంగంగా సవాల్​ విసురుతున్నా. మీరు చూపించగలరా? నా వద్ద బినామీ ఆస్తులు ఉన్నాయని? ఏదైనా ఫామ్​హౌస్​ నిర్మించుకున్నానా? షాపింగ్​ కాంప్లెక్స్​లు ఉన్నాయా? విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నానా? విదేశాల్లో ఏమైనా ఆస్తులు కొన్నానా?"

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: చివరి దఫా 'సిత్రం'- అన్న బాటలో సోదరి

Last Updated : May 14, 2019, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details