తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దీదీ' అభివృద్ధికి స్పీడ్​ బ్రేకర్​ : మోదీ - నరేంద్ర మోదీ

పశ్చిమ బంగలో అభివృద్ధి పనులు జరగకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పేదలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప వారి అభివృద్ధికి కృషి చేయడం లేదని తృణమూల్​ కాంగ్రెస్​, కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు ప్రధాని. బంగాల్​ సిలీగుఢీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

'దీదీ' అభివృద్ధికి స్పీడ్​ బ్రేకర్​ : మోదీ

By

Published : Apr 3, 2019, 7:17 PM IST

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగాల్​లోని సిలీగుఢీలో ప్రచార సభకు హాజరయ్యారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని బంగాల్​లో మమత ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత వరకూ బంగాల్ అభివృద్ధికి నోచుకోదని వ్యాఖ్యానించారు మోదీ.

భాజపా సభలో మాట్లాడుతున్న మోదీ

" దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా.. బంగాల్​లో మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. దానికి కారణం ఎవరో తెలుసా? పశ్చిమ బంగ​లో ఉన్న ఒక స్పీడ్​ బ్రేకరే... ఆ స్పీడ్ బ్రేకర్​ ఇక్కడి ప్రజలకు 'దీదీ' పేరుతో పరిచయం. మీ అభివృద్ధిని దీదీ అడ్డుకుంటున్నారు. ఆమెకు పేదలపై ధ్యాస లేదు. పేదలపై రాజకీయాలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పేదరిక నిర్మూలనకు ఎలా కృషి చేస్తారు. పేదలు లేకపోతే దీదీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్​, వామపక్షాలదీ ఇదే తీరు. వాళ్లకు పేదలు కావాలి, పేదలను ఎప్పటికీ పేదలుగా ఉంచితేనే వారికి రాజకీయ మనుగడ."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

పాక్​ కోసం మమత కన్నీరు

బాలాకోట్​లో భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడుల అనంతరం దేశ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తే... దీదీ మాత్రం కన్నీరు కార్చారని ఆరోపించారు మోదీ. తృణమూల్ కాంగ్రెస్​, కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ పాకిస్థాన్​ పట్ల సానుభూతి కనబరుస్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టోపై విమర్శలు

కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఏఎఫ్​ఎస్​పీ చట్టాన్ని సమీక్షిస్తామని పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. భద్రతా దళాలకు రక్షణ కవచంలా ఉన్న చట్టానికి మార్పులు చేసి వారిని నిస్సహాయులను చేయాలని కాంగ్రెస్​ భావిస్తోందని విమర్శించారు.

ఇదీ చూడండి:'వారి జేబుల నుంచే న్యాయ్​ నిధుల సేకరణ'

ABOUT THE AUTHOR

...view details