మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇంకా పోలింగ్ జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మాట్లాడారు మోదీ.
మోసపూరిత ప్రచారంలో చిక్కుకోవద్దు: మోదీ "భారత ఉజ్వల భవిష్యత్ కోసం కాశీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఓటరును ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ ఎన్నికలు జరగాల్సి ఉందో... ఆయా ప్రాంతాల్లో శాంతిపూర్వకంగా, ఓ పండుగలా ఓట్లు వేయాలి. మోదీ ఇప్పటికే గెలిచేశారు కాబట్టి ఓటు వేయకపోయినా ఏమీకాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దు. ఓటు మీ హక్కు. ప్రజాస్వామ్య పండుగ. అందరూ ఓటు వేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. దేశానికి బలం చేకూర్చాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల