తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై కాంగ్రెస్​ది మొసలి కన్నీరు: మోదీ - హరియాణాలో మోదీ

హరియాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తూ కశ్మీర్​పై కాంగ్రెస్​ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు.

మోదీ

By

Published : Oct 14, 2019, 5:12 PM IST

Updated : Oct 14, 2019, 5:56 PM IST

రఫేల్​ ఒప్పందంపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు ప్రధాని నరేంద్రమోదీ. కాంగ్రెస్​ తరహాలో కాకుండా దేశ భద్రతకు భాజపా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తున్నవారు.. అమరులైన సైనిక కుటుంబాలకు సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వల్లభ్​గఢ్​ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

"ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించే వారు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని వారి మేనిఫెస్టోలో చేర్చే ధైర్యం ఉందా? ఈ విషయంలో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. కశ్మీర్​లో అమాయక ప్రజలను కాపాడే క్రమంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ సమాధానమివ్వాలి. మేం కశ్మీర్​ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

Last Updated : Oct 14, 2019, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details