తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సభలో హాజరుపై మంత్రులకు మోదీ క్లాస్ - delhi

పార్లమెంటు సమావేశాల్లో రోస్టర్​ విధానం ప్రకారం హాజరు కావాల్సిందేనని, ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రమంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ తేల్చిచెప్పారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. పలు విషయాలపై పూర్తి సమాచారం తనకు అందజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషిని ఆదేశించారు.

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ

By

Published : Jul 16, 2019, 5:25 PM IST

పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర మంత్రులు రోస్టరు విధులను విస్మరించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. భాజపా ఎంపీల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ప్రతి విషయాన్ని తనకు తెలియజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషిని ఆదేశించారు. హాజరు కాని సభ్యులు, మంత్రుల జాబితాను సిద్ధం చేసి ఇవ్వాలని ప్రధాని సూచించారు.

మినహాయింపు ఉండదు

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. సభకు హాజరు విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. మంత్రులు నిర్వహించే శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. పార్లమెంటు సభ్యులకు ఓ ఉదాహరణ వివరిస్తూ కొన్ని ఆదేశాలిచ్చారు ప్రధానమంత్రి.

ప్రహ్లాద్ జోషి

"ఒకసారి కుష్ఠు వ్యాధి ఆసుపత్రి ప్రారంభానికి మహాత్మ గాంధీని పిలిచారు. అప్పుడు గాంధీ.. కుష్ఠు ఆసుపత్రి ప్రారంభానికి రాను. తాళం వేయడానికైతే వస్తానన్నారు. ఎందుకంటే ప్రపంచంలో కుష్ఠు వ్యాధి అనేదే ఉండకూడదు అనే వారు గాంధీ". ఇప్పుడు అదే తాళం మోదీ వేసి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకం ఏదైనా... జిల్లాలో వాటి పనితీరును ప్రతి ఎంపీ గమనించాలి. అధికారులతో మమేకమై ప్రజలకు చేరేలా చూడాలి. పార్లమెంటు విధులకు హాజరు కావాల్సిందే. అదే విధంగా పనులు నిర్వహించాల్సిందేనని ప్రధాని మమ్మల్ని ఆదేశించారు."

-ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీలందరూ సహకరించాలని ఆదేశించారు మోదీ. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!

ABOUT THE AUTHOR

...view details