బంగాల్లో ఫొని తుపాను ప్రభావాన్ని స్వయంగా తెలుసుకోవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అడ్డుకట్ట వేసింది. తుపాను ప్రభావంపై ఒడిశా తరహాలో ప్రధాని సమీక్ష నిర్వహిస్తారని కేంద్రం లిఖిత పూర్వక సమాచారం అందించినప్పటికీ మమతా బెనర్జీ సర్కార్ నుంచి సానుకూల స్పందన కరవైంది. ప్రధాని పర్యటనపై ఆసక్తి చూపని బంగాల్ ప్రభుత్వం... ఎన్నికల విధుల్లో అధికారులు తీరిక లేకుండా ఉన్నారని కేంద్రానికి జవాబిచ్చింది. ప్రధాని కార్యాలయం ఈ విషయం వెల్లడించింది.
మోదీ ఏరియల్ సర్వేకు దీదీ బ్రేక్...! - PM
బంగాల్లో ప్రధానమంత్రి నిర్వహించాలనుకున్న ఫొని తుపాను సమీక్షకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఒడిశా తరహాలో విహంగ వీక్షణం నిర్వహించాలని ప్రధాని భావించినా బంగాల్ ముఖ్యమంత్రి మమతా సర్కార్ పచ్చజెండా ఊపలేదు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మోదీ పర్యటన రద్దయినట్లు సమాచారం.
మోదీ ఏరియల్ సర్వేకు దీదీ బ్రేక్!
గతంలో ఇలా...
కొద్దిరోజుల క్రితమే ఫొని వివరాలు తెలుసుకునేందుకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాని రెండు సార్లు ఫోన్ చేశారు. ఈ రెండుసార్లు ముఖ్యమంత్రి ప్రచారంలో ఉన్నారని, ముఖ్యమంత్రే తిరిగి స్పందిస్తారని సమాచారం అందించారు బంగాల్ అధికారులు. చివరకు ఆ రాష్ట్ర గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని.
Last Updated : May 6, 2019, 3:36 PM IST