రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయేతర విషయాలపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో జరిగిన మాటామంతీలో... బాధ్యతగా పనిచేయడమే తన జీవితమని స్పష్టం చేశారు.
విరామం లేదు... విశ్రాంతి లేదు: మోదీ
తనకి బాధ్యతగా పనిచేయడం తప్ప మరొకటి తెలియదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదని నటుడు అక్షయ్ కుమార్తో మాటమంతీలో చెప్పారు.
"ఒకసారి మాకు సమావేశం జరిగింది. వాజ్పేయీ, అడ్వాణీ వంటి అగ్రనేతలున్నారు. ప్రమోద్ మహాజన్ కూడా ఉన్నారు. వారందరిలో నేనే చిన్నవాడిని. సమావేశం ప్రారంభమయ్యే ముందు రిటైర్మెంట్ అంశం వచ్చింది. అందరూ వారి ప్రణాళికలు చెప్పారు. నన్నూ అడిగారు. కానీ అది నాకు ఎంతో కఠినమైన అంశం. ఎందుకంటే నాకు ఇది తప్ప ఏం రాదు. ఇలాంటి విషయాలను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇచ్చిన పనినే జీవితంలా భావిస్తాను. బాధ్యతగా పని చేయడమే జీవిత పరమావధి. అందుకే రిటైర్మెంట్ ఆలోచన నాకు రాదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: మోదీ, దీదీల 'మిఠాయిలు, దుస్తుల' దోస్తీ