వస్త్రాలంకరణ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన ఫ్యాషన్ స్టైల్‌పై నటుడు అక్షయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఆయన మాటల్లోనే....
'అప్పటి పేదరికమే ఇప్పటి నా స్టైల్‌కు కారణం'
మోదీ కుర్తా...! వస్త్ర ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందిన డిజైన్. కుర్తా మాత్రమే కాదు... ఫ్యాషన్‌పరంగా మరెన్నో విషయాల్లో మోదీది ప్రత్యేక ముద్ర. ఎందుకిలా? ఫ్యాషన్‌కు, ప్రధానికి లింకేంటి?
"వస్త్రాలంకరణ సరిగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. బహుశా చిన్నతనంలో పేదరికం వల్ల ఆత్మన్యూనతాభావం ఉండేది. ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేయడానికి ఏం ఉండేది కాదు. గిన్నెలో వేడి బొగ్గులు వేసి బట్టలు ఇస్త్రీ చేసుకునేవాడిని. కానీ షూ లేదు. మా మామ ఒకసారి ఇంటికి వచ్చి షూ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అది దుమ్ముపట్టేది. పిల్లలు వెళ్లిపోయినప్పుడు నేను పాఠశాలలో ఉండిపోయేవాడిని. టీచర్లు వాడి పడేసిన చిన్న చిన్న చాక్ పీస్‌లు ఏరుకుని... ప్రతిరోజు ఉదయం షూపై వాటిని రుద్దేవాడిని."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: