లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యటకల తరలింపు కోసమే ప్రత్యేక రాళ్లను నడుపుతున్నట్టు రైల్వేశాఖ స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. అందువల్ల ఇతరులు రైల్వే స్టేషన్లకు రావొద్దని సూచించింది.
"దేశంలోని ఏ స్టేషన్లోనూ టికెట్లు అమ్మట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మినహా ఇతర రైళ్లను నడపడం లేదు. అధికారులు తీసుకొస్తున్న వారికే రైలు ప్రయాణం అందిస్తున్నాం. ప్యాసింజర్ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. అందువల్ల ఎవరూ స్టేషన్లకు రాకూడదు. ఈ విషయంపై అసత్య వార్తలను సృష్టించవద్దని వినతి."