తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్.. తన సొంత ఎద్దుకు జల్లికట్టుకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆలంగనలూరు జల్లికట్టు వేడుకలో మంత్రి ఇప్పటివరకు మూడు సార్లు బహుమతులు సాధించారు. అయితే ప్రస్తుతం విజయ్‌భాస్కర్ ఎద్దుకు శిక్షణ ఇస్తున్న వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు.
జల్లికట్టుకు 'ఆరోగ్య మంత్రి' బసవన్న సిద్ధం
తమిళనాట ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టకు తన ఎద్దును సిద్ధం చేస్తున్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి. నీటిలో ఈత కొట్టించడం, కొమ్ములతో ఢీకొట్టడం వంటివి నేర్పిస్తున్నారు.
జల్లికట్టుకు బసవన్నను సిద్దం చేస్తున్న మంత్రి
స్థానికంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలకు మంత్రి ఆటోలో వెళ్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను ఆహ్వనించారు. సుమారు 10 కి.మీల మేర ఆటో నడిపిన ఆయన దారిలో కనిపించిన ప్రతి ఒక్కరినీ.. వేడుకకు హాజరుకావాలని కోరారు. రాష్ట్ర మంత్రి స్వయంగా ఆటో నడుపుతూ వచ్చి.. సంబరాలకు పిలవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jan 16, 2021, 6:54 PM IST