"కనీస ఆదాయం అందిస్తాం" - congress
కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే దేశంలో పేదవారందరికీ కనీస ఆదాయం అందేలా చూస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు.
కనీస ఆదాయం అందిస్తాం
" దేశ ప్రజలందరికీ కనీస ఆదాయం అందిస్తాం. ఓ కనీస ఆదాయ రేఖను రూపొందిస్తాం. ఆ రేఖ కంటే తక్కువ ఆదాయం ఎవరికైతే ఉందో వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తాం. ఆ ఆదాయ రేఖ ఎగువకు పేదల ఆదాయం చేరుకునేలా చేస్తాం. అక్కడితో పేదరిక సమస్య పరిష్కారమవుతుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది. మరోసారి చెబుతున్నా ప్రతి పేదవాడి ఖాతాలో కాంగ్రెస్ పార్టీ డబ్బు వేస్తుంది.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు