జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు తెగబడ్డారు. త్రాల్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ జవాను గాయపడ్డాడు.
సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి - Pulwama
జమ్ముకశ్మీర్ పుల్వామా త్రాల్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డాడు.
సీఆర్‌పీఎప్‌కు చెందిన 180వ బెటాలియన్ బేస్ క్యాంప్‌పై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. క్యాంపు లోపల గ్రనేడ్ పేలటం వల్ల సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు అధికారులు.
దాడికి కారణమైన ఉగ్రమూకల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. క్యాంపు సమీప ప్రాంతంలోనే ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను పొట్టపెట్టుకున్నారు.