జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో మరో ముష్కరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
రంగ్రేత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. దీటుగా ఎదుర్కొన్న భద్రతా సిబ్బంది.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు.